
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు,నిధులు,నియామకాలు మనవి మనకి వస్తాయి అని భావించి కోట్లాది మంది కొట్లాడి తెస్తే ఇక్కడ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలంగాణ వచ్చిన తరువాత నియామకాలు చేప్పట్టలేదని అందరికి తెలిసిన విషయమే. ఉద్యోగాల కోసం యువత కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. ప్రభుత్వ పాలకుల వైఫల్యంతో నిరుద్యోగులు నష్టపోతున్నారు.
ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వారి మనుగడ ప్రశ్నార్థకమే అవుతోంది. సీఎం కెసిఆర్ నీళ్లు,నియామకాలు,నిధులు అనే స్లోగన్ తో నినదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. కాని సీఎం అయినా తరువాత కెసిఆర్ ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. దీంతో ఉపాధి కరువై బతుకు పోరాటంలో ఓడిపోతున్నారు. ఆత్మహత్యలకు సైతం వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో నిరుద్యోగుల్లో నిరుత్సాహం పెరుగుతోంది. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఏ మాత్రం చర్యలను తీసుకోవడం లేదు. ఫలితంగా అన్ని శాఖల్లో ఉద్యోగాల ఖాళీలే దర్శనమిస్తున్నాయి. ఉన్న ఉద్యోగాలను సైతం తగ్గించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగాల భర్తీకి చర్యలు ప్రారంభమైనట్లు వార్తలు వెలువడ్డాయి.కానీ ఆచరణలో మాత్రం మళ్లీ వాయిదా పడింది. దీంతో ప్రభుత్వ చర్య ఉండదనే విషయం బోధపడుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. ఫలితంగా వేలాది ఉద్యోగాలన్నీ భర్తీ చేసే నాథుడే కరువయ్యారు. అయితే ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైపోతుంది. ఆచరణ మాత్రం కనిపించడం లేదు. నిరుద్యోగుల జీవితాలు ఇక వెలుగులు చూడవనే తెలుస్తోంది. ప్రభుత్వం ఏ మాత్రం స్పందన చూపడం లేదు. దీంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది ఇప్పట్లో ఉండేలా కనిపించడం లేదు. ఇన్నాళ్లు ఎదురు చూసిన నిరుద్యోగులకు మళ్లీ నిరాశే కలుగుతోంది. ఉద్యోగాల భర్తీపై ఎప్పుడు ప్రభుత్వం దాటవేత ధోరణి ప్రదర్శిస్తూనే ఉంది. ఎన్నాళ్లకైనా తమ ఎదురు చూపు ఫలించకపోతుందా అన్న ఆశతోనే ఉన్నా వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి.