
జీహెచ్ఎంసి పరిధిలోని ఖానా మెట్ లో భూ వేలం పై టీఆర్ఎస్ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఖనా మెట్ లో గోల్డెన్ మైల్ లోని 15 ఎకరాల కు ప్రభుత్వం వేలంపాట నిర్వహించింది. కాగా, ఆ 15 ఎకరాల్లో మూడెకరాల స్మశాన స్థలం ఉంది. దీంతో స్మశానవాటిక సంబంధించి వేలాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. తాము సెంటిమెంట్ గా భావించే సమాధులను పరిరక్షించాలని కోర్టుకు విన్నవించారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న హైకోర్టు ఖానా మెట్ లోని మూడెకరాల స్మశాన వాటిక స్థలానికి వేలం వేయడాన్ని ఆపాలని ఆదేశించింది. తదుపరి హైకోర్టు తాత్కలికంగా స్మశాన వేలాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.