
ఈ మధ్య వస్తున్న పాటల్లో మాంచి మాస్ సాంగ్ ఏదైనా వుంది అంటే అది ‘హే తుర్రు ప్పా’. ఇది శ్రీకాకుళం యాస తో అసిరయ్య గారు అనే జానపద కళాకారుడు పాడిన పాట, రఘు కుంచే గారు ఇచ్చిన సంగీతం మంచి ఊపుని తెచ్చింది. ఎందరో కొత్త కొత్త కళాకారులకి అవకాశాలు ఇవ్వడంతో పాటు, అందరిని ప్రోత్సహిస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే గారు. ఈయన ఆ మధ్య బేబీ మరియు రాజు అనే కళాకారులతో పాట పాడించారు. మళ్ళీ అసిరయ్య గారితో శ్రీకాకుళం యాసతో పాడించారు రఘు గారు. పలాస చిత్రం లోని ‘నెక్కిలేసు గొలుసు’ పాట ఎంత ఆదరణ పొందిందో అందరికి తెలుసు. మళ్ళీ అలాంటి పాటను ఇప్పుడు బ్యాచ్ అనే చిత్రం ద్వారా మీ ముందు తీసుకు వచ్చారు. దయచేసి ఒక్క సారి ఈ పాట విని, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వున్న కళాకారులని ఎంకరేజ్ చేద్దాం.
తుర్రు ప్పా సాంగ్ వినడానికి ఈ కిందనున్న లింక్ క్లిక్ చేయండి.