
తీన్మార్ మల్లన్న!! తెలంగాణ రాష్ట్రంలో ఈయన ఫేమస్, ఈయన అధికార పార్టీ పై చేసే విమర్శలు, ఈయన చదివే న్యూస్, ఈయన ప్రభుత్వంపై చేసే పోరాటం ఇవన్నీ తెలంగాణ లో ఉన్న యూత్ ని ఆకట్టుకున్నాయి. ఈయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లలో నిలబడి అధికార పార్టీ కి చెందిన పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ని ఓడించినంత పని చేసాడు. రాజకీయ సమీకరణాల వల్ల తృటిలో ఓడిపోయాడు. మల్లన్న ఇపుడు తెలంగాణలో పార్టీ పెట్టె ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. యూత్ లో ఉన్న ఇమేజ్ ను బేస్ చేసుకుని ఆగస్టు 29న పార్టీ పేరు ప్రకటించి జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు మండలాల్లో బహిరంగసభలు పెట్టి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రము లో విద్య, వైద్యం కోసం 40 శాతం బడ్జెట్ కేటాయించేలా పోరాడాలని భావించాలని చూస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తీన్మార్ మల్లన్న కలిసినట్లుగా చెబుతున్నారు. కేజ్రీవాల్ కు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన ను తెలంగాణలో తాను మొదలు పెడ్తున్న పాదయాత్రకు రావాల్సిందిగా ఆహ్వానించారు. కేజ్రీవాల్ బాటలో నడిచేందుకు మల్లన్న తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పాదయాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డారు. తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలు తమ ప్రభావాలు చూపించే విధంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు పాచికలు వేస్తున్నాయి. తమ ఉనికి గుర్తించుకునేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ పలు పథకాలతో జనం ముందుకు వెళ్తుండగా ఇంకా కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ, తీన్మార్ మల్లన్న సైతం తమ ఉనికి చాటాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని రాజకీయ పార్టీల మధ్య వచ్చే ఎలక్షన్ లలో ప్రజలు ఎవరికీ పట్టం కడతారో వేచి చూడాలి.