
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మంచు విష్ణు & టీం.. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ‘మా’ నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. మంచు విష్ణుతో పాటు శివ బాలాజీ, గౌతం రాజు, కరాటే కళ్యాణి, పూజిత, జయవాణి, మాణిక్, శ్రీనివాసులు ఉన్నారు. విష్ణు ‘మా’కు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.
మా అధ్యక్షుడు అంటే సాధారణ విషయం కాదని, అది ఓ బాధ్యత… గౌరవ ప్రధమైన హోదా అని సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు ఈ సందర్బంగా అన్నారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల అనంతరం స్వామివారిని దర్శించుకన్నామని, అందరి కృషి వల్లే మేము గెలిచామన్నారు. మెజారిటీ సభ్యులు తమ ప్యానల్ నుంచే గెలిచారని తెలిపారు.