
మనకి తెలియకుండానే హ్యాకింగ్ సాప్ట్ వేర్స్ మనతో తప్పు చేయించి, మన ఫోన్లోకి ప్రవేశిస్తాయి. అందులో భాగంగా కొన్ని ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఒక లింక్ ను మెసేజ్ రూపంలో పంపిస్తారు. అది ఓపెన్ చేస్తే చాలు, ఆ వైరస్ మన ఫోన్ లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత ఫోను మొత్తం హ్యాకర్ చేతిలోకి వెళ్లిపోతుంది. ఆ క్షణం నుంచి ఫోన్లో ఉన్న సమాచారం మొత్తం హ్యాకర్ సేకరిస్తుంటాడు.
దీని వల్ల మనం ఫోన్ లో మాట్లాడే ప్రతి మాట వింటాడు. మన ప్రతీ డేటా సేకరిస్తాడు. కానీ ఇజ్రాయెల్ కు చెందిన ‘పెగాసస్’హాకింగ్ సాఫ్ట్వేర్ మాత్రం, మనం ఎలాంటి పర్మిషన్ ఇచ్చినా, ఇవ్వకున్నా, ఎలాంటి పొరపాటూ చేసినా, చేయకున్నా, మన ఫోన్లో కి వచ్చేస్తుంది. మొత్తం ఫోన్ ని హ్యాక్ చేసేస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఇప్పుడు ఈ పెగాసస్ హాకింగ్ సాఫ్ట్ వెర్, కేవలం ఒకే ఒక వీడియో మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ హ్యాక్ చేస్తుంది! అంటే, ఎవరి ఫోన్ హ్యాక్ చేయాలని భావిస్తున్నారో.. వారి ఫోన్ నంబర్ తెలిస్తే సరి. ఓ వీడియో మిస్డ్ కాల్ ఇచ్చేస్తారు. అంతే.. ఆ కాల్ లిఫ్ట్ చేసినా.. చేయకున్నా.. ఆ సాఫ్ట్ వేర్ ఆ ఫోన్లో చేరిపోతుంది. అంతే.. అప్పటి వరకు అందులోని సమాచారాన్ని, ఆ తర్వాత ఫోన్లో స్టోర్ అయ్యే డేటా మొత్తాన్నీ చోరీ చేసేస్తుంది.
ఈ సాఫ్ట్ వేర్ మన ఫోన్లో చేరిందని, మన ఫోన్ హ్యాక్ అయ్యిందన్న సంగతి మనకు తెలియదు. కాగా ఈ మధ్యన దుబాయ్ కు చెందిన హక్కుల కార్యకర్త అహ్మద్ మన్సూర్ తన ఫోన్ కొద్దిగా స్లో అయినట్టు అనిపించడంతో, అతను అనుమానించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. అయితే, ఈ సాఫ్ట్ వేర్ ఒక్కసారి ఫోన్లో చేరితో ఇక ఏమీ చేయలేమని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ మార్చేసి, పాస్ వర్డులు మార్చుకోవడం మినహా, ఇక చేసేది ఏమీ లేదని నిర్ధారిస్తున్నారు. కాగా ఇలాంటి సాఫ్ట్ వేర్ ను ప్రభుత్వాలు మాత్రమే వినియోగిస్తుంటాయని అంటున్నారు. ఇదే విషయమై విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు కూడా చేశాయి. అయితే, కేంద్రం మాత్రం తమకు సంబంధం లేదని చెబుతోంది. అయితే చట్టబద్ధంగా ప్రభుత్వాలు అవసరమైన వారి ఫోన్లు ట్యాప్ చేస్తాయి. కానీ.. అనధికారికంగా ఇలా చేయడం మాత్రం నేరమని భారత టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం చెబుతున్నాయి.