
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, యాక్టర్ తరుణ్‌లకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ క్లీన్చిట్ ఇచ్చింది. వారిద్దరూ 2017లో ఇచ్చిన గోళ్లు, వెంట్రుకలు, రక్తం నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చి చెప్పింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు 2017 జూలైలో పూరి జగన్నాథ్ , తరుణ్‌ల నుంచి నమూనాలు సేకరించారు. ఈ నమూనాలపై గతేడాది డిసెంబర్ 8న ఎస్ ఎల్ నివేదికలు సమర్పించినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. కెల్విన్‌పై చార్జ్‌షీట్‌తో ఎఫ్ ఎస్ ఎల్ నివేదిక వివరాలను కోర్టుకు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.