
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ మరో పథకం గెలిచింది. ఒలింపిక్స్ లో బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా హిస్టరీ క్రియేట్ చేసింది. బాక్సింగ్ విభాగంలో సెమీస్‌కు చేరి కొత్త ఆద్యం సృష్టించింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లవ్లీనా 69 కేజీల విభాగంలో అదరగొట్టింది. మాజీ వరల్డ్ చాంపియన్, చైనీస్ తైపీ ప్లేయర్ చెన్ నైన్ చిన్‌పై 4-1 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకుపోయింది. తద్వారా భారత బాక్సింగ్ కేటగిరీలో కనీసం కాంస్యం పతకం ఖాయమైంది.