
ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచ కప్ టోర్నీ రాబోతుంది. ఈ మేరకు ఎలాగైనా టోర్నీ నిర్వహించాలని సన్నాహాలు చేస్తుంది. కరోనా కారణంగా ఈ మెగా టోర్నీ వాయిదా వేస్తారు అనుకున్నారు కానీ ఐసీసీ మాత్రం ఈ ప్రపంచ కప్ ని ఎలాగైనా జరపాలని చూస్తుంది. తాజాగా, ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లతో గ్రూపులను ప్రకటించింది. ఈ మార్చి 20 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఆయా జట్ల స్థానాలను బట్టి వరల్డ్ కప్ గ్రూప్ లో చోటు ను కల్పించారు. టోర్నీ ప్రాథమిక దశ రెండు రౌండ్లలో సాగనుంది. ఐసీసీ ర్యాంకుల్లో వున్న టాప్ 8 జట్లు నేరుగా సూపర్-12 దశ లో ఆడతాయి. ఈ ఎనిమిది జట్లను గ్రూప్-1. గ్రూప్-2లో చేర్చారు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో దిగువన ఉన్న మిగిలిన జట్లను, అర్హత పోటీల ద్వారా మ్యాచ్ లను నిర్వహించి గెలిచిన జట్లను వాటిని గ్రూప్-ఏ, గ్రూప్-బి గా విభజించారు.
ఆయా జట్లు తొలి రౌండ్ మ్యాచ్ లు ఆడి, ఆపై రెండో రౌండ్ (సూపర్-12)కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 దశకు చేరతాయి. టాప్-8 జట్లతో కలిసి ఈ 4 చిన్న టీమ్ లు కూడా సెకండ్ రౌండ్ (సూపర్-12) ఆడతాయి. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు దుబాయ్, అబుదాబి, షార్జా, ఒమన్ క్రికెట్ స్టేడియాల్లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. త్వరలోనే టోర్నమెంట్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకటించనున్నారు. కాగా, దాయాదులు భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్-2లో ఉన్నాయి.
గ్రూప్-ఏ, గ్రూప్-బిలో ఉన్న జట్ల వివరాలు :
తొలి రౌండ్ …
గ్రూప్-ఏ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా
గ్రూప్-: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్
సెకండ్ రౌండ్ (సూపర్-12)…
గ్రూప్-1: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, గ్రూప్-ఏ విన్నర్, గ్రూప్-బి రన్నరప్.
గ్రూప్-2: ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, గ్రూప్-బి విన్నర్, గ్రూప్-ఏ రన్నరప్.