
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్కంఠ పోరులో స్కాట్లాండ్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని నమీబియా మరో ఐదు బంతులు ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. రూబెల్ ట్రంపెల్మన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో స్కాట్లాండ్ మూడు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ట్రంపెల్మన్ తొలి ఓవర్ తొలి బంతికే మున్సేను గోల్డెన్ డక్‌గా వెనక్కిపంపాడు.
ఆ తర్వాత అదే ఓవర్ మూడో బంతికి మెక్ లియెడ్‌ను డకౌట్‌గా.. నాలుగో బంతికి బెర్రింగ్టన్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ విధంగా ట్రంపెల్మన్ (1-0-2-3) తన తొలి ఓవర్ ద్వారానే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. టీ -20 ప్రపంచకప్ చరిత్రలో ట్రంపెల్మన్ తొలి ఓవర్‌ను క్రేజీ ఓవర్‌గా ఫ్యాన్స్ అభివర్ణిస్తున్నారు.