
ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తాకుతుంది. టీడీపీలో వున్నా సీనియర్ లు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే వరుస పరాజయాలతో కుదేలైన తెలుగుదేశం పార్టీని సీనియర్ నేతల రాజీనామాలు మరింత కుంగదీస్తున్నాయి. పలువురు నేతలు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామాలు చేశారు. ఆ జాబితాలోకి మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కూడా చేరారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి 1999, 2004 ఎన్నికల్లో మురుగుడు హనుమంతరావు గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని చేసిన మురుగుడు హనుమంతరావు గురువారం టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన నేరుగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు పంపారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, ఏ సేవలనూ పార్టీ వినియోగించుకోవడం లేదని, ఆ కారణంగా సుమారు ఏడాది నుంచి పార్టీకి దూరంగా ఉన్నానని రాజీనామా లేఖలో వివరించారు. ఆప్కో డెవలప్ మెంట్ కోసమే టీడీపీలో చేరానని, కానీ, ఆప్కో డెవలప్ మెంట్కు చంద్రబాబు ప్రభుత్వం సహకరించలేదని అన్నారు.