
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల కొరకు పని చేస్తున్న సంస్థలు అయినా మానవ హక్కుల నేతలు, ప్రతిపక్ష నాయకులూ మరియు జర్నలిస్ట్ లపై పెగాసస్ సాఫ్ట్వేర్ ను వాడుతూ వారి ఫోన్ లను హాక్ చేస్తుంది అని ఆయన మండి పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వారి వారి ప్రైవసీ హక్కులు హరిస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా సంఘిటితమై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.