
టోక్యో పారాలింపిక్స్ లో జావెలిన్ త్రో లో భారతీయ క్రీడాకారుడు సుమీత్ ఆంటిల్ తన అద్బుతమైన ప్రదర్శన తో పథకాన్ని సాధించాడు. ఈ రోజు జరిగిన ఎఫ్64 కేటగిరీలో జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో సుమీత్ ఆంటిల్ స్వర్ణ పథకం గెలిచాడు. ఈ క్రమంలో సుమీత్ విసిరిన జావెలిన్ 68.55 మీటర్ల దూరంలో విసిరి సరికొత్త వరల్డ్ రికార్డు కూడా నమోదు చేశాడు.
తన తొలి ప్రయత్నంలో 66.95 మీటర్లు విసిరిన సుమీత్, రెండో ప్రయత్నంలో మరింత మెరుగయ్యాడు. ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి నూతన ప్రపంచ రికార్డు స్థాపించాడు. టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మహిళా షూటర్ అవని లేఖర తొలి స్వర్ణం అందించడం తెలిసిందే.
A new world record 68.55.#SumitAntil congratulations for #GoldMedal #gold #Olympics pic.twitter.com/jixjPj6X5x
— Desi ?? (@pockingliberals) August 30, 2021