
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఇవాళ (శుక్రవారం). ఈ సందర్భంగా జయశంకర్ ను బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసి, మలి దశ ఉద్యమానికి ప్రాణమై నిలిచిన గొప్ప వ్యక్తి ఆయన అని కొనియాడారు. ‘‘జయశంకర్ సార్ బతికుంటే.. తెలంగాణలో నేడున్న పరిస్థితి చూసి ఇందుకేనా రాష్ట్రాన్ని సాధించుకుందని ఆయన కంట కన్నీరు ఏరులై పారేది..’ అంటూ సీఎం కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. జయశంకర్ బతికుంటే ఈ పాలకులను గద్దె దించేందుకు కచ్చితంగా మరో ఉద్యమానికి ఊపిరూలూదేవారంటూ కేసీఆర్ పాలనా తీరుపై దుమ్మెత్తి పోశారు.
తెలంగాణలోని నగరాలను డల్లాస్, ఇస్తాంబుల్, లండన్.. ఇంకేవో చేసేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, లక్షల సంఖ్యలో ఖాళీలు ఉన్నా వాటిని భర్తి చేసేందుకు ఎందుకు ఆలోచిస్తునారని ప్రశ్నించారు. రైతులు, నకిలీ విత్తనాలు, వర్షాలు పడితే నీట మునిగిపోయే కాలనీలు, కొవిడ్ సమయంలో ప్రజారోగ్యం మొదలైన అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.‘ఇదే నా జయశంకర్ సార్ కోరుకున్న తెలంగాణ? ఇది అధికార పార్టీకి మాత్రమే బంగారు తెలంగాణ తప్ప ప్రజలకు కాదు..” అంటూ వరుస ట్వీట్లలో విజయశాంతి విరుచుకుపడ్డారు.
మన భూమి, మన ఉద్యోగాలు, మన నీరు మనకే కావాలని ఎందరో ఉద్యమకారులు కుటుంబాల్ని పణంగా పెట్టి బలిదానాలతో అమరులయ్యారు. వారి ఆశయాలకు ఈ సర్కారు ఏ కాస్తయినా విలువనిచ్చిందా? మన నీరు దోపిడీకి గురవుతుంటే…
— VIJAYASHANTHI (@vijayashanthi_m) August 6, 2021
తెలంగాణ సర్కారు చోద్యం చూస్తూ కూర్చుంది. నకిలీ విత్తనాలు, ఎరువుల కొరతను ఎదుర్కుని అన్నదాతలు పంటలు పండిస్తుంటే… మద్దతు ధర లేదు, కొనుగోలు కేంద్రాలు ఉండవు. చివరకు గతిలేక తమ పంటలకు తామే మంట పెట్టుకోవాల్సిన దుస్థితి.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) August 6, 2021