
మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా ‘లూసిఫర్’ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. మెగాసూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్ బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కు రీమేక్ ఇది. ఈ పొలిటికల్ డ్రామాలో మోహన్ లాల్, మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి తెలుగులో చిరుతో పాటు ఎవరెవరు నటిస్తున్నారు అనేదానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే చిత్రబృందం అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. చిరు ఇమేజ్, తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్ లో ఛేంజెస్ చేశారు డైరెక్టర్ మోహన్ రాజా. ‘గాడ్ ఫాదర్’ అనే సాలిడ్ టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. కథానాయికతో సహా కీలకమైన హీరో సిస్టర్ క్యారెక్టర్‌కి సంబంధించిన నటీనటుల ఎంపిక ఇంకా పూర్తవలేదు. చిరు – సల్మాన్ మధ్య మంచి రిలేషన్ ఉంది. రామ్ చరణ్ షూటింగ్ కోసం బాంబే వెళ్తే సల్మాన్ ఇంటినుండి క్యారేజ్ వెళ్లేది. అలాగే సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మెగాస్టార్ ఇంటికి తప్పక వస్తుంటారు.