
టీఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరోమారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ నిన్న నేను బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తనకు కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రోజు అవకాశమిస్తే బీజేపీ నేతల అంతు చూస్తానని అన్నారు. ఇంకా మాట్లాడిన ఆయన బండి సంజయ్ గుడ్డలూడదీసి రోడ్డుపై నిలబెడతానని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ఉందని భయపడే ప్రసక్తే లేదని… తాను చేతులకు గాజులు వేసుకోలేదని అన్నారు.
మైనంపల్లి మాట్లాడుతూ, బండి సంజయ్ భూముల కుంభకోణం త్వరలోనే బయట పెడతానని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో దేవాలయాలను దోచుకున్న చరిత్ర బండి సంజయ్దని అన్నారు. బండి సంజయ్ మాదిరే మరో బీజేపీ నేత కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని… ఆయన సంగతి కూడా చూస్తానని చెప్పారు. తెలంగాణలో అశాంతిని నెలకొల్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు.