
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించిన యడియూరప్ప తదుపరి ఆయన రాజీనామా ను కర్ణాటక గవర్నర్ ఆమోదించారు. కాగా వేరొకరు ముఖ్యమంత్రి పదవి సీకరించే వరకు యడియూరప్ప ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని ఆ రాష్ట్ర గవర్నర్ కోరారు. ఇంకో వైపు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ని ఎవరిని చేయాలో నిర్ణయించే పనిలో బిజెపి పెద్దలు వున్నారు. కాగా, యడియూరప్ప ఎన్నో ఏళ్లుగా బిజెపి కి సేవ చేసిన యెడల తనకు అత్యున్నత గౌరవ స్థానం ఇవ్వాలని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. అందులో భాగంగా ఏదైనా రాష్ట్రానికి గవర్నగా నియమించాలని అనుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే పలువురు పార్టీ సీనియర్లను పక్కకు తప్పించి, వారిని వివిధ రాష్ట్రాలకు గవర్నర్ లుగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. ఇదే కోవలో యడియూరప్పకు కూడా గవర్నర్ ఛాన్స్ లభించబోతోందని చెపుతున్నారు.