
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో వరసగా రెండో గెలుపు ను తన ఖాతాలో జమ చేసుకుంది. గ్రూప్-జెలో చెయుంగ్ ఎన్గాన్ యి అనే హాంకాంగ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణితో తలపడిన పోరులో భారత స్టార్ షట్లర్ సింధు 2-0తో విజయం సాధించింది. ఈ గెలుపుతో క్వార్టర్స్‌కు అర్హత సాధించి పతకంపై ఆశలు రేపింది. మరోవైపు,భారత మహిళల హాకీ జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. పూల్-ఎలో భాగంగా గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన పోరులో 1-4 తేడాతో పరాజయం పాలైంది.