
★
వ్యాక్సినేషన్ మొదలు పెట్టిన కొత్తలో కేంద్రం కోవిషీల్డ్ డోసుల వ్యవధి 30 రోజులు. ఆతర్వాత 42 రోజులు.. మరల ఇప్పుడు 84 రోజులుగా ఉంది…అయితే మన తెలంగాణ రాష్ట్రం మాత్రం వ్యవధిని 84 రోజుల నుండి మరో 14 రోజుల పాటు పెంచి మొత్తం 98 రోజులు చేసింది…!

★
కాగా కేంద్రం మాత్రం రెండో డోసు కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కోసం టoచనుగా 84 రోజులకే ఫోన్ మెస్సేజ్ పంపుతుండగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా అక్కడ ఉన్న సిబ్బంది రాష్ట్ర కోటా డోసు వ్యవధి మరో 14 రోజులు పెంచింది…కావున 98 రోజుల తర్వాత మాత్రమే రండి అని చెప్పి వెల్లగొడుతున్నారు…

★
ఇంకేం ఉంది ఉచిత రెండో డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకుందామని ఫోన్ కు మెసేజ్ రాగానే పనులన్నీ వాయిదా వేసుకొని వెళితే అక్కడ ఉన్న ఆసుపత్రి సిబ్బంది చెప్పిన సమాధానం విని ఉసూరుమంటూ జనాలు తిరిగి వస్తున్నారు…!

★
ఇప్పటికైనా జనాలు ఇబ్బంది పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఓ ఆలోచన చేసి తమ వద్ద ఉన్న స్టాక్ ఆధారంగా వ్యవధి నిర్ణయం చేసి ప్రజలకు సరియైన సందేశాన్ని పంపాలని పలువురు కోరుతున్నారు…

— ఇ.సతీష్ —