
అతి తక్కువ టైములో మొబైల్ టెక్ వరల్డ్ లో ఎక్కువగా రీచ్ అయినా ఆప్ ఏదైనా వుంది అంటే అది వాట్సాప్ మెసెంజర్. కొత్త కొత్త ఫీచర్స్ అప్డేట్ తో దూసుకుపోతోంది. అతి త్వరలో మరో కొత్త ఫీచర్ తో మన ముందుకు రాబోతుంది. ఈ కొత్త ఫీచర్ ఐఫోన్, ఆండ్రాయిడ్ వెర్షన్ లతో పాటు desktop వెర్షన్ లో కూడా సపోర్ట్ చేసేలాగా డిజైన్ చేసారు. iMessage, Signal మాదిరిగానే మల్టీ డివైజ్ ఫంక్షనాలిటీతో end-to-end Encryption తో పనిచేస్తుంది. ఫేస్ బుక్ సొంత యాపే ఈ వాట్సాప్ మెసేంజర్. సెక్యూరిటీ ప్రాబ్లెమ్స్ పేస్ చేస్తున్నప్పటికీ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంలో మాత్రం వెనుకాడటం లేదు. ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువస్తున్న ఆప్ WhatsApp multi-device సపోర్ట్ ఫీచర్. చాట్ యాప్స్ లో Multi-device functionality అనేది ఒక బేసిక్ ఫీచర్.. iMessage దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ఫీచర్ iOS, macOS, watchOS డివైజ్‌లలో వర్క్ అవుతుంది. ఐఓఎస్ లో అయితే కొత్త డివైజ్ ద్వారా కరెక్ట్ Apple ID తో లాగిన్ కావాల్సి ఉంటుంది.
ప్రస్తుతానికి వాట్సాప్ డెస్క్ టాప్ ఫంక్షనాలిటీ అందుబాటులో లేదు. కానీ, ఫోన్ ద్వారా Whatsapp Web కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త మల్టీ డివైజ్ ఫీచర్ ద్వారా ఒకే సమయంలో వేర్వేరు డివైజ్‌లకు సపోర్ట్ చేయనుంది. మీ ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ యాక్టివ్‌గా ఉందా అనే దానితో సంబంధం లేకుండా పని చేస్తుంది. ఒకేసారి అనేక డివైజ్ ల్లో వర్క్ చేసేందుకు ఈ యాప్ అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ ఫోన్ దగ్గరలో లేకపోయినా ఎప్పుడైనా డెస్క్‌టాప్ యాప్ వినియోగించుకోవచ్చు. ఈ మల్టీ డివైజ్ ఫీచర్ వాట్సాఫ్ బీటా ట్రయల్ వెర్షన్ యూజర్లకు వచ్చే నెలలో లేదా రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నట్టు ఇటీవల ఫేస్ బుక్ వెల్లడించింది.
ఈ WhatsApp multi-device application ప్రారంభంలో పరిమితంగా మాత్రమే సపోర్ట్ చేయనుంది. ఒకసారి అందుబాటులోకి వచ్చాక కేవలం నాలుగు డివైజ్ లకు మాత్రమే లింక్ చేసుకోవచ్చు. అందులో ఒకటి మాత్రమే ఫోన్ డివైజ్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే.. Non-Phone డివైజ్ ల్లో కూడా QR కోడ్ ద్వారా వాట్సాప్ కనెక్ట్ చేసుకోవచ్చు. WhatsApp multi-device application పూర్తిగా అందరి యూజర్లకు అందుబాటులోకి వచ్చేంతవరకు మీరు Beta Program ద్వారా నమోదు చేసుకోవచ్చు. తద్వారా Desktop Beta కోసం WhatsApp Desktop app ఆటోమాటిక్‌గా వాట్సాప్‌గా కన్వర్ట్ అవుతుంది.