
వదిలిన బాణం.. విడిచిన మాట రెండూ డేంజరే.. ఎక్కడ టంగ్ స్లిప్ అయినా కూడా ఈ సోషల్ మీడియా యుగంలో ఓ ఆట ఆడుకుంటున్నారు. నెట్ లో బట్టలిప్పి బరివాత నిలబెట్టేలా ట్రోల్ చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజయ్య కూడా ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు.. కేసీఆర్ పై నోరుజారి అడ్డంగా ఇరుక్కున్నాడు
ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నోరు జారారు. ఒక అర్థంలో మాట్లాడబోయి ఇంకో అర్థంలోకి మారిపోయారు. దీంతో వివాదాస్పదమవుతోంది. ఆయన ఇప్పటికే పలుమార్లు పలు వివాదాల్లో దూరినా ప్రస్తుతం అచ్చంగా దొరికిపోయారు. తొందరలో మాట్టాడారో కావాలనే చెప్పారో కానీ తెలియడం లేదు. కానీ తన నోటి దురుసుతనంతో ప్రతిసారి ఏదో సందర్భంలో బుక్కవుతున్న సంగతి తెలిసిందే.
జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాటలు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాయి. సీఎం కేసీఆర్ ను పొగిడే క్రమంలో ఆయన పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. మాటల్లో నిజాయితీ కొరవడింది. మహిళలకు అనుకూలంగా మాట్లాడేందుకు ప్రయత్నించి వారినే విమర్శించే విధంగా దారి తప్పారు.
దీంతో బాలింత మహిళ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇచ్చే సూట్ కేసులో నిండా బట్టలు, సబ్బులు, పరుపు, దుప్పట్లు, దోమతెర, నూనెలు, పౌడర్లు వంటివి బయటపడుతున్నాయి. గతంలో ఇలా ఇచ్చే వారు కాదు. ముసలోల్లో, అన్నగారోల్లో , నాయనమ్మ, బాపమ్మలే పట్టుకుని ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వమే ఇస్తోందని చెప్పి తన నోరు జారారు.