
మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం నడిచింది. కొద్ది రోజుల క్రితం .. హైదరాబాద్‌లో వర్ష పరిస్థితులపై మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే రాజాసింగ్. తనతో పాటు మంత్రి కేటీఆర్ బైక్ రైడింగ్‌కు రావాలని కోరారు. వర్షం పడుతున్న వేళ రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో లైవ్‌గా చూపిస్తానన్నారు. పాతబస్తీని అభివృద్ధి చేస్తామంటూ అసెంబ్లీలో మాట్లాడుతున్నారని, అయితే, కేటీఆర్ తనతో బుల్లెట్ బైక్ మీద వస్తే అభివృద్ధి ఎలా ఉందో చూపిస్తానంటూ వారం క్రితం రాజాసింగ్ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. ప్రభుత్వం చెబుతున్నదానికి, చేస్తున్న దానికి పొంతన లేదని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలకు తాజాగా కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. గత కొద్ది కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ముందు వాటి గురించి ప్రజల అభిప్రాయాలను అడగండి అంటూ.. కేటీఆర్ రాజాసింగ్ కి సూచించారు, ‘పెట్రోల్ బంక్ కి వెళ్లి.. అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకీ ఎలా పెరుగుతున్నాయో మీరు ఎందుకు తెలుసుకోకూడదు? అంతేకాదు.. సామాన్యుల ఇళ్లకు వెళ్లి.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఎలా పెరుగుతుందో కూడా అడగొచ్చు. దేశంలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెంచడమని అర్థమా..?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
Why don’t you go to petrol bunk & find out what people are saying about hike in Petrol & Diesel prices?
Also stop at a household & enquire with them on how LPG cylinder prices are going up?
GDP ⬆️ = Gas, Diesel, Petrol Suna Hi Hoga?
Ab Yeh Jhumle bandh Karo, Kaam se Dil Jeeto https://t.co/0vhy4BYjyX
— KTR (@KTRTRS) October 23, 2021