
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంక్షోభంపై ఓ కీలక ప్రకటన చేసింది. దేశంలో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ప్రస్తుతం బొగ్గు నిల్వలు దాదాపు 7.2 మిలియన్ టన్నులు ఉన్నాయని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.
కోల్ ఇండియా వద్ద 40 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఈ బొగ్గు నిల్వల సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యుత్ సంక్షోభం పై… రాష్ట్రాలు ఆందోళన చెందవళసిన అవసరం లేదని కేంద్రం తెలిపింది.