
కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ మధ్య వచ్చిన ‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’ సినిమాతో హిట్ కొట్టిన కిరణ్, చాందిని చౌదరి జంటగా మరో సినిమాను రూపొందిస్తున్నారు. ‘సమ్మతమే’ అనే అంటూ ముందుకు వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, కంకణాల ప్రవీణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
చాందిని చౌదరి ‘కలర్ ఫోటో’ హిట్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఇద్దరి కలయికలో మంచి సినిమా ఉండబోతుంది అని చిత్ర యూనిట్ నమ్మకంగా వున్నారు. ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను విడుదల చేశారు.
టైటిల్ ను బట్టి ఇది ఒక ప్రేమకథ అనిపిస్తుంది .. ఫస్టు గ్లింప్స్ తో అది నిజమేననే విషయం స్పష్టమవుతుంది. హీరోహీరోయిన్లు ఇద్దరూ కార్పొరేట్ జాబ్స్ చేస్తూ లవ్ లో పడతారనే విషయం ఫస్టు గ్లింప్స్ వలన అర్థమవుతుంది. ఇక హీరోయిన్ మందుకొడుతూ .. సిగరెట్ తాగుతూ హీరోకి షాక్ ఇవ్వడం ఈ వీడియోలోని కొసమెరుపు.