
కార్తీక మాసం సందర్భంగా 18వ తేదీ రాత్రి లేదా 19వ తేదీ ఉదయం 4.30 గంటల లోపు అంటే సూర్యోదయం కాకముందే దీపాలు, లక్ష వత్తులు లేదా నూట ఒక్క, 365 ఇలా వత్తులు వెలిగించుకోవచ్చు.19వ తేదీ శుక్రవారం కూడాను.
మరో లెక్క ప్రకారం కార్తీక మాసం 15వ రోజు కూడా అవుతుంది. కాబట్టి వత్తులు వెలిగించాలి అనుకునేవారికి మాత్రం 19వ తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చును…అదేవిధంగా నోములు, తోరాలు ఉన్నవారు కూడా 19వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం లోపు ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. పౌర్ణమి తిధి ఉంటుంది కాబట్టి. 18వ తేదీ లక్ష్మి వారం సాయంత్రం కూడా నోములు, వ్రతాలు చేసుకోవచ్చు ఆక్షేపణ లేదు.పెద్దగా ఇందులో సందేహించాల్సిన పని లేదు.మనం భగవంతునికి ఆత్మ నివేదన చేసుకోవాలి. తద్వారా చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా భగవంతునికి ప్రీతిపాత్రమే. నిరంతర నామస్మరణతో సర్వేశ్వరుడు మన వెన్నంటే ఉంటారు.