
రేవంత్ రెడ్డి టిపిసిసి అయ్యాక కాంగ్రెస్ పార్టీకి నూతన కళ నెలకొంది. పార్టీ కార్యకర్తలు ఉత్సహం తో పని చేస్తున్నారు. దళిత, గిరిజనుల కోసం తెరాస ప్రభుత్వంపై దానోదార మోగించడానికి సిద్దపడుతున్నారు. వీరిని తెరాస ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో వివరిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడతామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఆగస్టు 9 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17 వరకు పల్లెపల్లెకు తిరిగి ‘దళిత, గిరిజన దండోరా’కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. ఓ వీడియో ను పోస్ట్ చేస్తూ ఈ కార్యక్రమం ఎందుకు చేపడుతున్నామో ఆయన వివరించారు.
“భూమి కోసం ‘బాంఛెన్ కాల్మొక్తా’ అని ఇప్పటికీ గిరిజనం వేడుకుంటోన్న దృశ్యాలు కనిపిస్తోన్న స్వరాష్ట్రం.ఈ పరిస్థితిని ప్రశ్నించేందుకే క్విట్ ఇండియా మొదలైన ఆగస్టు 9న కాంగ్రెస్ పార్టీ ‘దళిత-గిరిజన దండోరా’కు శంఖారావం పూరిస్తోంది.ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ప్రశ్నించే గొంతుక నినదించబోతోంది “
భూమి కోసం ‘బాంఛెన్ కాల్మొక్తా’ అని ఇప్పటికీ గిరిజనం వేడుకుంటోన్న దృశ్యాలు కనిపిస్తోన్న స్వరాష్ట్రం.ఈ పరిస్థితిని ప్రశ్నించేందుకే క్విట్ ఇండియా మొదలైన ఆగస్టు 9న కాంగ్రెస్ పార్టీ ‘దళిత-గిరిజన దండోరా’కు శంఖారావం పూరిస్తోంది.ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ప్రశ్నించే గొంతుక నినదించబోతోంది pic.twitter.com/RobDQvQIMM
— Revanth Reddy (@revanth_anumula) July 27, 2021