
ప్రశాంత్ కిశోర్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ఈయన ఏదైనా పార్టీకి సపోర్ట్ గా పని చేశారంటే ఆ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారం లోకి రావాల్సిందే.. ఈయన పన్నే వ్యూహాలు కొన్ని సార్లు అధికార పార్టీ వాళ్ళకి చెమటలు పట్టిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ టైం లో ఏపీ సీఎం జగన్ రెడ్డి సలహాదారునిగా ఉండి వైసీపీ ని అధికారంలో కి వచ్చేలా చేసాడు. అలాగే మొన్న జరిగిన బెంగాల్,తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈయన వ్యూహాలు వల్ల డీఎంకే , టీఎంసీ పార్టీలు అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు ఓ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది అదేంటంటే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ జోరుగా వినబడుతుంది. నిన్న ప్రశాంత్ కిశోర్, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ ,ప్రియాంక లతో భేటీ సంగతి తెలిసిందే, రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలు, 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలపై వీరు చర్చించారని పైకి చెపుతున్నప్పటికీ, అంతకు మించి ఏదో జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రశాంత్ కిశోర్ 2024 ఎలక్షన్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ కోసం ఆ పార్టీలో కీలక పాత్రను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. . బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడిన పీకె, ఇకపై తాను వ్యూహకర్తగా పని చేయబోనని సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తారా? అని అడగగా, ఆయన తానొక విఫల నేతనని చెప్పారు. అంతకుముందు ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్ జేడీయూ పార్టీలో చేరారు , ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వెళ్లబోతున్నట్టు చెబుతున్నారు.