
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా కి సరి అయిన వైద్యం లేదన్న విషయం తెలిసిందే. ప్రస్తుత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కరోనా ను రాకుండా కట్టడి చేయలేదు. అన్ని దేశాలు శాశ్వతంగా కోవిద్ రాకుండా ఉండేందుకు వారి వారి వాక్సినేషన్ గూర్చి ప్రయోగాలు చేస్తూనే వున్నాయి . ప్రస్తుతం ప్రపంచంపై డెల్టా, డెల్టా ప్లస్ కొత్త కొత్త వేరియంట్లు బలంగా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 112 దేశాల్లో డెల్టా వేరియంట్ ప్రభావం చూపుతోందని సమాచారం. ఈ వేరియంట్ మొదట ఇండియాలో నే గుర్తించబడింది. దీనిని ఢీ కొట్టేందుకు ఆయా దేశాలు తమ తమ రీసెర్చ్ లు చేటున్నారు. ఇందులో భాగంగా అమెరికన్ శాస్త్రవేత్తలు తమ రీసెర్చ్ లో ఓ సరికొత్త యాంటీబాడీని కనుగొన్నారు. ఇది కొవిడ్‌కి చెందిన అన్ని రకాల వైరస్ లను ఎదుర్కోగలదని చెబుతున్నారు. దీని పేరు S2H97. దీనిని మొత్తం 12 రకాల యాంటీ బాడీల మీద అధ్యయనం చేసి మరీ కనుగొన్నారట. అన్ని రకాల కరోనా వైరస్ ప్రోటీన్లకు అంటుకుపోయి, కణాల్లోకి చేరకుండా చేస్తుందట. అనగా కరోనా వైరస్ ఉన్న చోటు నుంచి ఇతర కణాలకు సోకకుండా చేస్తుంది. ఆ విధంగా ఈ వైరస్ ను అరికట్టవచ్చ ని భావిస్తున్నారు. అందుకే.. దీన్ని సూపర్ యాంటీ బాడీ అని పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సార్స్-కొవీ2 వైరస్ లు యాంటీ బాడీలను తప్పించుకొని తిరుగుతున్నాయి. వీటికి కూడా సూపర్ యాంటీ బాడీ చెక్ పెడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రకాల వేరియంట్లు విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఈ కొత్త యాంటీ బాడీ గొప్ప ఉపశమనంగా చెబుతున్నారు. దీని ద్వారా అన్ని రకాల కరోనా వైరస్ లకు ఒకే టీకా రూపొందించడానికి ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.