
ఒకసారి కరోనా వచ్చి తగ్గిన వారందరికి గుడ్ న్యూస్. కరోనా నుంచి కోలుకున్న వారిలో అభివృద్ధి చెందే యాంటీబాడీలు 9 నెలలపాటు క్రియాశీలంగా ఉంటాయని బ్రిటన్ కు చెందిన శాస్త్రవేత్తలు గురించారు. బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజీ లండన్, ఇటలీలోని పాడువా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనా బారినపడిన వ్యక్తుల్లో ఆ సమయంలో వారిలో వ్యాధి లక్షణాలు ఉన్నా, లేకున్నా వారిలో యాంటీబాడీలు 9 నెలలపాటు మనుగడలో ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న ఇటలీలోని ఓ పట్టణానికి చెందిన 2 వేల మందిని పరీక్షించిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. లక్షణాలు ఉన్న వారితోపాటు, లేనివారిలోనూ 9 నెలలపాటు యాంటీబాడీలు క్రియాశీలంగా ఉండడాన్ని తాము గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.