
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ అన్నది తప్పక వాడవలసిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగులు సహా స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థులు ఇలా అందరికీ ఫోన్ వాడకం తప్పనిసరి అయింది. ఇప్పుడు మనిషికి ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా,బంధువు అయినా ఫస్ట్ ఫోన్ నే. అది లేకుండా ఏ పని జరగదు.ఫోన్ ని మనలో ఒకడిగా చూస్తూ వుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా??
మీరు ఏదైనా పని చేస్తున్నపుడు, లేదా వర్షంలో తడిసినపుడో మనకు తెలియకుండానే మన ఫోన్ నీళ్లలో తడిసి పోతుంటుంది. ఇలా తడిసినప్పుడు ఫోన్ జనరల్ గా పాడవుతూ ఉంటుంది. కానీ నీళ్లలో, వర్షం లో గాని తడిసిన ఫోన్ ని మనం, మనకు తెలిసిన వాటితో మాక్సిమం ఫోన్ పాడవకుండా కాపాడుకోవచ్చు. అదెలా అంటారా?ఒకవేళ ఫోన్ నీళ్లలో గాని, వర్షంలో గాని తడిస్తే మొదట కంగారు పడకుండా ఫోన్ ని పొడి బట్టతో తుడిచి, ఫోన్ లో ఉన్న సిమ్ ని తీసేయాలి, బ్యాటరీ ని కూడా తీసేయాలి. కొన్ని ఫోన్లలో బ్యాటరీ ని తీసే సౌలభ్యం ఉండదు.
అలాంటప్పుడు ఫోన్ ఆన్ చేయకుండా సిమ్ తీసేసి, మీ దగ్గర కనుక వాక్యూమ్ క్లీనర్ ఉన్నట్లయితే దానితో ఫోన్ ని క్లీన్ చేయాలి అది ఫోన్ లోపల ఉన్న తడిని లాగేస్తుంది. తర్వాత కొంత సేపు ఎండలో పెట్టి అప్పుడు ఆన్ చేస్తే ఫోన్ వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. సాధారణంగా చాలా మంది ఇండ్లల్లో వాక్యూమ్ క్లీనర్ వాడకం తక్కువ కనుక అలాంటప్పుడు సిమ్ , బ్యాటరీ తీసేసిన ఫోన్ ని బియ్యం సంచి లో గాని, బియ్యం డబ్బాలో గాని వేసి ఫోన్ మునిగేలా పెట్టాలి. అలా ఒక రోజు గాని, 6 నుండి 7 గంటలు గాని పెట్టాలి. అలా చేస్తే ఫోన్ లోకి వెళ్లిన నీటి తేమ ను బియ్యం లాగేసుకుంటుంది. ఆ తర్వాత కొద్దిసేపు ఎండలో పెట్టి ఆన్ చేసుకుంటే మన ఫోన్ ని మనం మాక్సిమం కాపాడుకో గలుగుతాము.
గమనిక:ఈ ప్రాసెస్ ని టెక్నికల్ గా ఎవరు నిర్ధారించలేదు కానీ ఇలా చేస్తే వర్క్ అవుట్ అవుతుంది.