
వివో సబ్‌బ్రాండ్ ఐకూ ఇటీవలే ఐకూ 7 స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇవి మనదేశంలో చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి. దీంతో ఇప్పుడు వాటికి తర్వాతి వెర్షన్‌గా ఐకూ 8ను కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవి ఆగస్టు 4వ తేదీన లాంచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో కూడా ప్రీమియం ఫీచర్లను కంపెనీ అందించనుంది.
ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్‌ను ఆగస్టు 4వ తేదీన నిర్వహించనున్నట్లు టీజర్ ద్వారా తెలిపింది. ఇందులో ఫోన్ పేరు తెలపకపోయినా.. ఇవి ఐకూ 8 అయి ఉంటాయని తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ కూడా వీబోలో ఈ స్మార్ట్ ఫోన్ల గురించి లీక్ చేశారు.
ఐకూ 8 స్పెసిఫికేషన్లకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఈ టిప్‌స్టర్ షేర్ చేశారు. దీని ప్రకారం.. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్ అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌కు ఓవర్‌క్లాక్డ్ వెర్షన్‌గా ఈ ప్రాసెసర్ లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 888 క్లాక్ స్పీడ్ 2.8గిగా హెర్ట్జ్‌గా ఉండగా, 888 ప్లస్ క్లాక్ స్పీడ్ 3 గిగాహెర్ట్జ్‌గా ఉండనుంది.
ఈ స్క్రీన్‌షాట్ ప్రకారం.. ఇందులో క్యూహెచ్డీ స్క్రీన్‌ను అందించనున్నారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1440 x 3200 పిక్సెల్స్‌గా ఉంది. 12 జీబీ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఇందులో ఉండనుంది. 256 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 1.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఐకూ 7 కంటే ఐకూ 8లో పెద్ద డిస్ప్లే, ఎక్కువ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ ఉండనున్నాయి. ఐకూ 7 సిరీస్‌లో రెండు ఫోన్లు ఉండనున్నాయి. ఐకూ 7 లెజెండ్‌లో కూడా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌నే అందించారు. ఐకూ 7 సిరీస్‌లో 6.62 అంగుళాల ఫుల్హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రేష్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 300 హెర్ట్జ్‌గానూ ఉండనుంది.
హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్ కూడా ఇందులో ఉంది. ఈ డిస్ప్లేలో ప్రెజర్ సెన్సిటివ్ ఏరియాలు కూడా ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి.