
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ బెంగళూరు కార్యాలయం ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది . ఈ సంస్థ 68 ప్రాజెక్ట్ ఇంజనీర్ల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ పాసైన వాళ్లు ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.ada.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇందులో ఎంపికైన వారిలో రెండేళ్ల అనుభవం ఉన్నవారికి రూ. 50,000+ డియర్నెస్ అలవెన్స్, నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లకు రూ. 60,000+ డియర్నెస్ అలవెన్స్, ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లకు రూ.70,000+ డియర్నెస్ అలవెన్స్ ఇస్తారు. అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 35 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు వీటి కోసం అప్లై చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ప్రిలిమినరీ ఆన్లైన్ ఇంటర్వ్యూ, ఫైనల్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. 2021 సంవత్సరం జులై 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ గా ఉంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.