
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించినప్పటికీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు మాత్రం జరగలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఇందుకు సంబంధించిన పిటిషన్ పై డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం తరఫున నిరంజన్ రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న పిమ్మట తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. కాగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పరిషత్ ఎన్నికలకు తగిన సమయం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారనే కారణంగా సింగిల్ బెంచ్ ఈ ఎన్నికలను రద్దు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.