
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టి సీరియస్ పొలిటిషన్ గా మారబోతున్నాడు. ఇప్పటికే జగన్ పై విమర్శిస్తూ యాక్టివ్ గా ఉన్నాడు. తాజాగా పవన్ కీలక వాఖ్యలు చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేశారు. ఉండవల్లి వ్యాఖ్యలను పవన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఉండవల్లి వంటి మేధావులు మాట్లాడిన మాటలను బట్టి ఆర్థిక తీవ్రతను అర్థం చేసుకోవచ్చని పవన్ ట్వీట్లో తెలిపాడు.
వైసీపీ సర్కార్‌పై మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని ఉండవల్లి ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని.. అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని ఉండవల్లి అన్నారు. ఎంతో మంది సలహాదారులు ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయ పరిస్థితులు ఉండటం దారుణమన్నారు. ఇంత జరుగుతున్నా అసలు ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని అరుణ్ కుమార్ అన్నారు.