
దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయం తెలంగాణ రాష్ట్రము లోనే సుప్రసిద్ధ ఆలయం. కరోనా కారణంగా తెలంగాణ లో అన్ని దేవాలయాలు మూతపడ్డ విషయం తెలిసిందే, ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. కోరిన కోర్కెలు తీర్చే, కొంగు బంగారం చేసే వాడిగా రాజన్న ని కొలుస్తారు భక్తులు. తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ నుండి రాజన్న దర్శనానికి భక్తులు వస్తూ ఉంటారు. ఈరోజు సోమవారం ఏకాదశి పర్వదినం అయినందున భక్తుల రద్దీ చాలా వుంది, దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. కరోనా తగ్గిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు భక్తులు. మాస్కులు, శానిటైజర్ వాడుతూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా, కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ గుడిలోకి భక్తులని అనుమతిస్తున్నారు.