
‘ఎఫ్2’ మూవీ తర్వాత విక్టరి వెంకటేష్ చేస్తున్న మాస్ మూవీ నారప్ప. ‘ఎఫ్2’లో కామెడీ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేసిన వెంకీ, నారప్ప సినిమాలో సీరియస్ మాస్ పాత్రతో అలరించాడు. ఏ పాత్రలో అయినా యిట్టె ఇమిడిపోయేలా నటించడం వెంకీ కి వున్న ప్రత్యేకత. నారప్ప లాంటి క్యారక్టర్ దొరకాలే గాని ఒక ఆట ఆడేస్తాడు. ‘నారప్ప’లో ఊర మాస్ క్యారెక్టర్ లో కత్తి పట్టి నరుకుతూ అలా జీవించేసాడు. ఈ క్రమంలోనే ఫుల్ మాస్ మాసాల సాంగ్ లో మరోసారి విక్టరీ వెంకి మన ముందుకు వచ్చాడు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలనే నారప్ప మూవీకి దర్శకత్వం వహించారు. కరోనా ప్రభావం కారణంగా చాలా రోజుల నిరీక్షణ తర్వాత ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో జూలై 20న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తమిళంలో ధనుష్ హీరో గా సూపర్ హిట్ అందుకున్న ‘ఆసురన్’ చిత్రానికి రీమేక్ గా ఈ ‘నారప్ప’ సినిమా తెరకెక్కింది. దీనిలో భాగంగా బుధవారం ‘నారప్ప’ ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.భూమి కోసం పోరాటం చేసే వ్యక్తిగా వెంకటేష్ నటన కట్టిపడేసేలా ఉంది. ఆయన చెప్పిన ‘చదువు’ పై డైలాగ్ అదిరిపోయేలా ఉంది. కులవ్యవస్థ, భూవివాదం వంటి సామాజిక అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసి ‘నారప్ప’గా రూపొందించారు.
వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించగ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, కార్తిక్ రత్నం కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.