
అధికార బీజేపీకి ఉత్తరాఖండ్‌లో భారీ షాక్ తగిలింది. మంత్రి యశ్పాల్ ఆర్య, ఆయన కుమారుడు సంజీవ్ ఆర్యతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. యశ్పాల్ ప్రస్తుతం రవాణాశాఖ మంత్రి కొనసాగుతున్నారు. యశ్పాల్ ఆర్య సంజీవ్ నైనిటాల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఢిల్లీలో హరీశ్‌రావత్, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ సమక్షంలో తండ్రీ కొడుకులు కాంగ్రెస్‌లో చేరారు.
గతంలో యశ్పాల్ ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్‌గా పని చేయగా.. తిరిగి పార్టీలో చేరడం మళ్ళీ ఇంటి రావడం అని కేసీ వేణుగోపాల్ అన్నారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన బీజేపీ సభ్యత్వానికి, మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారని రణదీప్ సుర్జేవాలా తెలిపారు. యశ్పాల్ 2007-14 వరకు ఉత్తరఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా కొనసాగారు.