
సూర్యాస్తమయం : 6.33
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు
శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.చతుర్దశి ఉ.10.07 వరకు, తదుపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ ప.2.51 వరకు, తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం రా.10.28 నుండి 12.00 వరకు, దుర్ముహూర్తం ఉ.8.14 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.22 వరకు అమృతఘడియలు… ఉ.10.18 నుండి 11.46 వరకు.
మేష రాశి: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం ఉంటుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు సంభవిస్తాయి.
వృషభ రాశి: ధనవ్యయం ఉంటుంది. ఇంటాబయటా ఒత్తిడులు వస్తాయి. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు , ఉద్యోగస్తులకు గందరగోళం ఏర్పడుతుంది. విద్యార్థులకు నిరుత్సాహం.
మిథున రాశి: ఆర్థికాభివృద్ధి ఉంటుంది. నూతన ఉద్యోగ యోగం వుంది. ముఖ్య నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు.
కర్కాటక రాశి: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు అవుతాయి. ఆర్థిక పరిస్తితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
సింహ రాశి: సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరపు బంధువుల కలయిక. అనుకున్న పనుల్లో జాప్యం కలుగుతుంది. దైవదర్శనాలు.
కన్యా రాశి: బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. అప్పులు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు వస్తాయి.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.
తులరాశి: సంఘంలో గౌరవం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. విద్యార్థుల యత్నాలు సఫలం.
వృశ్చిక రాశి: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ధనవ్యయం. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి. విద్యార్థులకు శ్రమాధిక్యం.
ధనుస్సు రాశి: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. వస్తు, వస్త్ర లాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి.
మకర రాశి: వ్యయప్రయాసలు. చేసే పనులలో కొద్దిపాటి ఆటంకాలు సంభవిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
కుంభ రాశి: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఆహ్వానాలు రాగలవు.
మీన రాశి: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు పురోగతిలో ఉంటాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది.