
బ్యాంకు అకౌంట్ వున్నవాళ్లందరూ తస్మాత్ జాగ్రత్త, అలానే మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి మీరు బ్యాంకు అకౌంట్ కి లింక్ అయి ఉన్నట్లయితే మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అకౌంట్,స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లంతా కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న క్రమంలో మనం అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాగా, ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. సైబర్ ఎటాక్స్ చాలా పెరిగిపోతున్నాయి. అందువల్ల స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారు ఇష్టమొచ్చిన యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోకుండా ఉండాలి. గూగుల్ ప్లేస్టోర్‌లో కూడా ప్రమాదకరమైన యాప్స్ ఉంటాయి. కొన్ని యాప్స్‌లో జోకర్ వైరస్ ఉందని నివేదికలు వెలువడుతున్నాయి. జెడ్ స్కెలార్ థ్రెట్‌ల్యాబ్జ్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం దాదాపు 11 యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకింగ్ మోసాలు జరిగే అవకాశం ఉంది. మీ ఫోన్లో కూడా ఇలాంటి యాప్స్ ఉంటే వెంటనే డిలేట్ చేయండి. లేదంటే మీ బ్యాంక్ ఖాళీ అయ్యే అవకాశముంది.
మీ ఫోన్ లో కనుక ఈ యాప్స్ ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.
Free Affluent Message – ఫ్రీ అఫ్లుయెంట్ మెసేజ్
Font Style Keyboard – ఫాంట్ స్టైల్ కీబోర్డు
delux Keyboard – డీలక్స్ కీబోర్డు
Comply QR Scanner – కాంప్లే క్యూఆర్ స్కానర్
PDF Converter Scanner – పీడీఎఫ్ కన్వర్టర్ స్కానర్
Saying Message – సేయింగ్ మెసేజ్
Read Scanner – రీడ్ స్కానర్
Print Scanner – ప్రింట్ స్కానర్