
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విలయతాండవం చేస్తుంది . మన దేశంలో కరోనా ప్రభావం చాలానే వుంది. ఒక వైపు వాక్సినేషన్ చేస్తూనే ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం సూచించిందో ఆ విధంగా అడుగులు వేసింది కూడా. ఇప్పటికే చాల మందికి వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. కాగా ఇప్పుడు వున్నా పరిస్థితులని బట్టి చిన్న పిల్లలో కూడా వాక్సినేషన్ వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. వచ్చే సెప్టెంబర్ నెలలో పిల్లలు సంబంధించిన కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రపంచంలోనే డీఎన్ఏ ఆధారంగా తయారైన తొలి కరోనా వ్యాక్సిన్ గుజరాత్ కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జై కోన్ డీ కావడం గర్వించదగిన విషయం. దీని ప్రక్రియ కి సంబంధించి జులై 1న కంపెనీ అత్యవసర అనుమతుల కోసం డీ సీబీఐకి దరఖాస్తు చేసుకుంది. ఈ వ్యాక్సిన్ 12 ఏళ్లకు పైబడిన వారిపై పనిచేస్తుంది అని తెలిపింది. చిన్న పిల్లలపై చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి . కాగా పిల్లలపై కోవాగ్జిన్ ట్రయల్స్ సైతం త్వరలో పూర్తి కానున్నాయి. టీకా ఆమోదానికి అపెక్స్ డ్రగ్ రెగ్యులేటర్ కు ఆమోదానికి పంపించారు. అనుమతులు రాగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని చీఫ్ పేర్కొన్నారు. అమెరికా వ్యాక్సిన్ అయిన ఫైజర్, మోడెర్నా ను ఇప్పటివరకు 12 ఏళ్లలోపు పిల్లలకే వేసేందుకు అనుమతి వచ్చింది. ఈ రెండు ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఇక కొవాగ్జిన్ ట్రయల్స్ 12-18 ఏళ్లు, 6-12 ఏళ్ల చిన్నారులకు రెండు డోసుల టీకా ప్రయోగం పూర్తి చేశారు. ఇప్పటికే 2-6 ఏళ్ల మధ్య చిన్నారులకు తొలి డోసు టీకా ఇచ్చారు. రెండో డోసు టీకా ఇవ్వాల్సి ఉంది. థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం లో చిన్న పిల్లలకు రావచ్చనే ఊహాగానాల మధ్య ఈ ఈ చిన్న పిల్లల వాక్సిన్ రాబోతుండడం సంతోషించదగ్గ పరిణామం