
కాకతీయులు పాలించిన ప్రదేశం అనగానే గుర్తొచ్చే పేరు ఓరుగల్లు, అదేనండి వరంగల్. ఇటీవల సీఎం కేసీఆర్ వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా మార్చుతున్నట్లు ఆయన ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ జారీ అయింది.
ఇక వరంగల్ జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉంటాయని ఆ నోటిఫికేషన్ లో తెలిపారు.
హన్మకొండ జిల్లాలో హన్మకొండతో సహా పరకాల డివిజన్లు ఉంటాయని, మొత్తం 12 మండలాలు ఈ జిల్లా పరిధిలోకి రానున్నాయని ప్రభుత్వం పేర్కొంది. హన్మకొండ జిల్లా కేంద్రంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గాన్ని పరిగణిస్తారని వివరించింది.
జిల్లాల పేరు మార్పుపై ఎవరికైనా అభ్యంతరాలు, వినతులు ఉంటే తెలియ చేయాలని, అందుకు నెల రోజుల గడువు ఇస్తున్నట్లు ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.