
కేంద్రం ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత సులభతరం చేసింది . వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ కోసం కో విన్ ఆన్‌లో లైన్ లో రిజిస్టర్ అయ్యి స్లాట్ బుక్ చేసుకొనే వీలు ఉండేది. ఇపుడు ఇంకా ఈజీ గా స్లాట్ బుక్ చేసుకోవడానికి వాట్సాప్ లోనూ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోదలచినవారు కొవిన్ పోర్టల్ లో గానీ, నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద గానీ తమ వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ పొందేవారు. ఈ క్రమంలో కేంద్రం వ్యాక్సినేషన్ బుకింగ్ విధానంలో నూతన సదుపాయం కల్పించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ మంగళవారం ట్వీట్ చేశారు. వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ బుక్ చేసుకునే పద్ధతి.. పౌరుల సేవలో కొత్త యుగానికి తెరలేపిందని మంత్రి తెలిపారు. ఈ విధానం వల్ల వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ మరింత సులువుగా మారుతుందని చెప్పారు. ఫోన్లలోనే చాలా సులువైన పద్ధతిలో కరోనా వ్యాక్సిన్ ను బుకింగ్ చేసుకోవచ్చన్నారు. కేవలం నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు.
మరి వాట్సాప్ ద్వారా టీకా స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలంటే..
- ఇందుకోసం ముందు MyGovIndia Corona Helpdesk నంబరు 91-9013151515ను మీ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత వాట్సాప్‌లో ఈ నంబరుకు ‘Book Slot’ అని మెసేజ్ పంపాలి.
- అప్పుడు మీ ఫోన్ నంబరుకు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి నంబరు వెరిఫై చేసుకోవాలి.
- ఆ తర్వాత తేది, లొకేషన్, పిన్‌కోడ్, వ్యాక్సిన్ టైప్ తదితర వివరాలను నింపాలి.
- అన్నీ పూర్తయ్యాక Confirm చేస్తే మీకు స్లాట్ బుక్ అవుతుంది.