
వర్షాకాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది దురదతో బాధపడుతుంటారు. ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్ కి దారి తీస్తాయి. కాళ్ళు, చేతులకు తడి తాకగానే దురద వల్ల గోకుతూ ఇన్ఫెక్షన్ కి దారి తీసి ఇబ్బంది పడతారు. ఇలాంటి వాటి నుండి ఇక బాధపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో అతి తక్కువ ఖర్చుతో మనమే పెడిక్యూర్ చేసుకోవచ్చు. మీకు కావలసింది ఒక పెడిక్యూర్ బ్రష్ మాత్రమే. చిట్కా లోకి వెళ్దాం .. ముందుగా కాళ్ళని కడుక్కోవాలి తర్వాత పొడిగా తుడుచుకొని కొబ్బరి నూనె తో ఒక 15 నిమిషాలు మర్దన చేయండి. ఒక టబ్ లో మూడో వంతు వేడి నీళ్లు(గోరువెచ్చని నీటి కంటే కొంచెం వేడి) తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు మరియు ఒక షాంపూ ప్యాకెట్ వేసి అందులో కాళ్ళ ని 15 నిమిషాలు ఉంచి బ్రష్ తో మెల్లిగా మడమలు , పాదాలు , గోర్లని స్క్రబ్ చేసి చల్లని నీళ్లతో కడగండి. కాళ్ళని తడిలేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాసుకుంటే ఎంతో అందమైన కాళ్ళు మీ సొంతం. ప్రతి రెండు వారాలకు ఒకసారి ఇలా చేయడం వల్ల దుమ్ముతో నల్లగా మారిన మీ పాదాలు త్వరలోనే నలుపు పోయి తెల్లగా మృదువుగా మారతాయి. రోజు రాత్రి పడుకునే ముందు కాళ్ళకి మాయిశ్చరైజర్ పెట్టుకుంటే కాళ్ళు మృదువుగా మెత్తగా ఉంటాయి