
అక్కినేని నాగ చైతన్య, సమంత లు గత నెల తమ వైవాహిక జీవితం నుండి విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత క్యారెక్టర్ ను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె పర్సనల్ స్టైలిష్ ప్రీతమ్ జువాల్కర్ కి, ఆమెకు మధ్య ఏదో ఉందంటూ యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించారని సదరు యూట్యూబ్ ఛానళ్లపై సమంత హైదరాబాదులోని కూకట్ పల్లి కోర్టులో పరువునష్టం దావా కేసు వేసింది.
పిటిషన్ పై వాదనల సందర్భంగా కోర్టు తన అభిప్రాయాలను వెల్లడించింది. సదరు యూట్యూబ్ ఛానళ్లపై పరువునష్టం దావా వేయడం కంటే… వాటి నుంచి క్షమాపణ కోరవచ్చు కదా అని అడిగింది. మరోవైపు ఈరోజు ఈ కేసుపై తుదితీర్పు వెలువడనుంది.