
‘ఆహా’ వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమాల ఓటిటి వేదిక. కొత్త కొత్త కథలతో వచ్చే సినిమాలకు కేరాఫ్ అడ్రస్. వైవిధ్యభరితమైన సినిమాలు అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇప్పటికే చాల మలయాళం కు సంబందించిన సినిమాలను తెలుగులోకి డబ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందించింది. ఇప్పుడు ఇదే తరహాలో మలయాళం లో నయనతార నటించిన ‘నిళల్’ సినిమాను, ‘నీడ’ పేరుతో తెలుగు లోకి ఈ నెల 23వ తేదీన విడుదల చేస్తున్నారు. అప్పు భట్టాత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కుంచాకో బోబన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సెకండ్ క్లాస్ చదువుతున్న ఓ పిల్లాడు తన తోటి పిల్లలకు ఒక కథ చెబుతాడు. ఆ కథ విన్న మిగతా
పిల్లలంతా భయంతో వణికిపోతారు. ఆ కథ ఏమిటి? స్కూల్ నుంచి మొదలైన ఆ కథ ఏ స్థాయివరకూ వెళుతుంది? ఆ పిల్లాడి జీవితాన్ని ఆ కథ ఎలా ప్రభావితం చేసింది? అనేదే ఈ సినిమా కథ. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నయనతార ప్రధాన పాత్ర కావడం వలన, అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ సినిమాకి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో చూడాలి.