
టెక్నికల్ రంగం ,ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ ఒక జాబ్ లాగ చేస్తున్నారు. కొంత మంది ల్యాండ్స్ లీజ్ కి తీసుకొని వీకెండ్ ఫార్మింగ్ లాగ చేస్తుంటే, మరికొందరు తమ ఇంటి ఢాబా ల పై వాళ్ళకి అందుబాటులో వున్న వనరులతో ఫార్మింగ్ చేస్తున్నారు. ఇలా సాగు చేస్తున్న వారు, ఇంకా రైతన్నలకు తాము పండించిన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎలా వెరిఫై చేయించుకోవాలో, వాటికీ ఏ విధంగా, ఎలా మార్కెట్ చేయాలో అనే విషయాలలో సాధారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈ నేపథ్యంలో “సేంద్రీయ దృవీకరణ (ఆర్గానిక్ వెరిఫికేషన్) మరియు సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్ (ప్రొడక్ట్స్ మార్కెటింగ్)” సంబంధించిన వ్యవహారాలపై ఔత్సాహికులకు శాస్త్ర & సాంకేతిక పరమైన అవగాహన కల్పించడానికి సుస్థిర వ్యవసాయ కేంద్రం (CSA) అనుబంధ సంస్థ అయిన గ్రామీణ అకాడమీ ఆధ్వర్యంలో జూలై 23, 24 తేదీ ల నాడు రెండు రోజుల పాటు జూమ్ ఆప్ ద్వారా ఆన్ లైన్ కోర్సు ను నిర్వహించబోతుంది. ఈ కోర్సు ఫీజు రూ.1500 కాగా, వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ గ్రామీణ అకాడమీ వెబ్ సైట్ లో జరుగుతుంది.