
టాలీవుడ్ఇండస్ట్రీ లో విజువల్ వండర్ లా గ్రాండ్ మూవీ తీయాలంటే వన్ అండ్ ఓన్లీ రాజమౌళి అనే చెప్పాలి. రాజమౌళి సినిమా అంటే చెక్కిన శిల్పంలా ఉంటుందని ఆయన్నీ జక్కన్న అని పిలుస్తారు. ఆయన కథ అల్లుకునే తీరు, చూపించే విధానం, ఆయన స్క్రీన్ ఫ్లే అన్ని ఒక వండర్ లాగ ఉంటాయి. ఇక రాజమౌళి నుండి సినిమా వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఎదుచూసే అభిమానులు కోకొల్లలు. ఈ సారి జక్కన్న, అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వారి జీవితాల ఆధారంగా చేస్తున్న ఈ సినిమాలో ప్రధాన కథానాయకులుగా ఎన్టీఆర్ – రామ్ చరణ్ పరిచయం చేస్తూ ‘ఆర్ ఆర్ ఆర్’ ని తీర్చిదిద్దారు. కాగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను ఈరోజు రిలీజ్ చేశారు.
ఆర్టిస్టులకు సంబంధించి ఆయా సన్నివేశాలకు వివరిస్తున్న రాజమౌళి, యాక్షన్ సన్నివేశాల మేకింగ్, గ్రాఫిక్స్ కి సంబంధించిన వారితో చర్చించడం,
ఆర్ట్ డైరెక్టర్ తో కలిసి సెట్స్ నమూనాలను పరిశీలించడం .. చేయనున్న సీన్స్ గురించి కెమెరామెన్ తో మాట్లాడటం, గ్రాఫిక్స్ కి సంబంధించిన షాట్లను పరిశీలించడం వంటి అంశాలపై కట్ చేసిన మేకింగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
జక్కన్న ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో ఈ వీడియో చుస్తే తెలుస్తుంది. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీన రావడం పక్క మరోసారి స్పష్టం చేశారు.