
‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా వెయిట్ చేస్తున్నారు. జక్కన్న చెక్కిన ఈ చిత్రం నుండి ఒక కొత్త న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. టాలీవుడ్ సూపర్ స్టార్స్ తారక్, రాంచరణ్ కలిసి నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీ గా వున్నాయి. హైస్టారికాల్ స్టోరీ అవడం వల్ల ఈ చిత్రంపై అంతకు మించి అంచనాలు పెట్టుకున్నారు సినీ ప్రేమికులు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు .. స్పెషల్ వీడియోలు అంతకంతకూ ఆసక్తిని పెంచుతూ వచ్చాయి. ఈ సినిమాని అత్యంత భారీ అంగుళాలతో, భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ జక్కన్న రాజమౌళి సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ కేరాఫ్ అడ్రస్ కీరవాణి, ఈ యన్ ఈ హైస్టారికాల్ మూవీ కి కూడా సంగీతమ్ అందించారు. గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ సినిమా లో ని ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీన ఫ్రెండ్షిప్ డే కానుకగా ఉదయం 11 గంటలకు ఫస్టు సాంగును రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ఒక పోస్టర్ ను వదిలింది సినిమా యూనిట్. స్నేహం నేపథ్యంలో సాగే ఈ పాట, ఒకేసారి 5 భాషల్లో విడుదల కానుంది. విడుదల అయినా పోస్టర్ లో కీరవాణితో పాటు యుంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, విజయ్ ఏసుదాస్ తదితరులు కనిపిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో, అజయ్ దేవగణ్ .. అలియా భట్ వంటి బాలీవుడ్ నటీనటులతో పాటు, హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.