
సాధారణంగా మనం చిక్ పీస్ (పెద్ద చేనగలు) తో ఏమైనా వంటలు చేయాలంటే ముందు వాటిని నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని ఉడకబెట్టి మనకి నచ్చిన రెసిపీస్ని మనం తయారు చేసుకోవచ్చు. అయితే వీటిని నానబెట్టిన తర్వాత వచ్చే నీళ్ళని పారబోసేస్తాం. కానీ దీనిలో చాలా ముఖ్యమైన పోషక పదార్థాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
దీనిని చాలా మంది ప్రయోజనం లేదు అని పారబోసేస్తారు కానీ ఆరోగ్యానికి ఈ నీళ్లు చాలా మేలు చేస్తాయి. దీనిని Aquafaba లేదా Chickpea Water అంటారు. శాఖాహారులు ఎగ్ వైట్కి బదులు దీనిని తీసుకోవచ్చు అని నిపుణులు చెప్పడం జరిగింది. మయోనీస్ చేయడానికి కూడా దీనిని ఉపయోగిస్తారట. అయితే దీని వల్ల మరెన్నో బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెప్పారు. వాటి కోసం కూడా ఇప్పుడు మనం చూసేద్దాం.
Aquafaba ఎలా తయారు చెయ్యాలంటే..?
దీని కోసం పెద్దగా శ్రమించక్కర్లేదు. ఎంతో ఈజీగా దీనిని మనం తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే… దీని కోసం మీరు కొద్దిగా చిక్ పీస్ తీసుకుని వాటిలో నీళ్లు పోసి నానబెట్టిన 4 నుండి 7 గంటల పాటు అలానే వదిలేసి ఆ తర్వాత ఆ నీటిని వడకట్టుకోవాలి. అంతే అండి Aquafaba రెడీ అయిపోయింది. మీరు ఇప్పుడు వీటిని ఉడకబెట్టాలంటే దానికి ఇదే నీళ్లు కావాలంటే వాడొచ్చు. ఎందుకంటే వీటిలో మంచి పోషక పదార్థాలు లభిస్తాయి.
ఈ నీళ్లను తీసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్:
ఇప్పటి వరకు దీన్ని ఎలా తయారు చేయాలి అనేది చూశారు కదా.. ఇప్పుడు దీని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చూసేద్దాం.. ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం నానబెట్టిన నీళ్లల్లో లేదా ఉడికించినప్పుడు వేసిన నీళ్ళల్లో కూడా మంచి పోషక పదార్థాలు వెళ్లిపోతాయి. ఆ నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.
ఇక దానిలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి అనే విషయం లోకి వస్తే.. విటమిన్ డి, ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ అంటే లినొలెనిక్ లేదా ఒలిక్ యాసిడ్ లాంటివి ఉంటాయి.
ఎగ్ వైట్ కి బదులుగా ఇది ఎలా పని చేస్తుంది..?
శాకాహారులు గుడ్డును తీసుకోకపోతే ఎగ్ వైట్కి బదులుగా దీనిని ఉపయోగించవచ్చు. ఈ నీటిని విప్ చేస్తే ఎగ్ వైట్ని విప్ చేసినట్లుగా మారుతుంది. ఎగ్ వైట్లో ఉండే పోషక పదార్థాలు దీనిలో లభిస్తాయి.
మంచి ప్రోటీన్స్ మరియు స్టార్చ్ దీని ద్వారా మనం పొందవచ్చు. మాయోనీజ్ లాంటి వాటిల్లో దీనిని బాగా ఉపయోగించుకోవచ్చు. గుడ్డు నచ్చని వాళ్ళు దీనిని వాడుకోవడం మంచిది. ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఈ మిశ్రమాన్ని పాలు లేదా బట్టర్ కి బదులుగా బేకింగ్ చేసేటప్పుడు ఉపయోగించవచ్చు.