
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ.. సరికొత్త విషయాలు నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో సాధారణ జనంతో కనెక్ట్ అయ్యే పోస్ట్‌లు చేస్తుంటారు. ఆయన చేసే ట్వీట్లు ఆలోచన రేకెత్తించే విధంగా, ఎంతో సరదాగా కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ‘కెలాగ్స్ ఉప్మా’ మీద పోస్టు చేసిన మీమ్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఈ ట్వీట్‌తో ఆయన విదేశీ కంపెనీలకు బలమైన సందేశమే ఇచ్చారు. కెలాగ్స్ సంస్థను ట్రోల్ చేస్తూ నెట్లో వైరల్ అవుతున్న పోస్ట్‌నే తీసుకొని ఆయన తన సొంత కామెంట్ యాడ్ చేశారు. వివరాల్లోకి వెళితే..
భారతీయుల బ్రేక్‌ఫాస్ట్ అలవాట్లనే మార్చేస్తానంటూ పదేళ్ల కిందట ఇక్కడి మార్కెట్లో అడుగుపెట్టిన కెలాగ్స్.. ఇప్పుడు చివరికి మన ఉప్మానే అమ్ముకుంటోందన్నది ఆ మీమ్స్ సారాంశం. ఓ స్టోర్‌లోని కెలోగ్స్ ఉప్మా ప్యాకెట్ల ఫొటోను ఈ మీమ్స్‌కు వాడుకున్నారు. దీనిని ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేస్తూ.. ‘‘సెంటిమెంటే గెలిచింది. లోకల్ చాంపియన్స్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు..’’ అని సరదాగా కామెంట్ చేశారు. దీనిపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందించారు. ‘మేము కేవలం ఆహారాన్ని మాత్రమే తినము. సెంటిమెంట్లను కూడా తింటాం’ అని ఒకరనగా.. ఇక భవిష్యత్తులో బ్రేక్ ఫాస్ట్ లోకి వీరి నుంచి దోశ, ఇడ్లీ కూడా మార్కెట్ లోకి వస్తాయేమో… అంటూ మరొకరు ఫన్నీ కామెంట్ చేశారు.
Kellogg’s has been here for longer than a decade. So this is dated but the meme is going around now. And the sentiment endures. Never underestimate the power of our local ‘champions.’ pic.twitter.com/qnm64FyC4L
— anand mahindra (@anandmahindra) September 19, 2021